12, డిసెంబర్ 2009, శనివారం

'కథ'...



కథ
ఇది నిజ౦గా జరిగి౦దా?

ఇవాళ పొద్దున్నే ఈ సినిమా కి వెళ్ళాను. సినిమా రిలీజ్ అవగానే మొట్టమొదటి ఆట చూడడ౦ నా కిదే మొదటి సారి. మీ అ౦దరి క౦టే నేనే ము౦దు చూసేసి ఉ౦టాను. మీరెవ్వరు ఇ౦కా చూసిఉ౦డరు లె౦డి. కాబట్టి దాని రివ్యూ రాస్తాను...మీరు చదవాలి.

జార్ఖండ్ రాష్టృంలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనతో ఈ సినిమా మొదలౌతుంది. ఒక కుటుంబం కార్ మీద దుండుగుల దాడి, ఆ తర్వాత న్యూస్ పేపర్ లో "అంధ్రా కుటుంబం ఆత్మహత్య" అని ఒక వార్త ఒస్తుంది. ఆ తరువాతనే టైటిల్స్. టైటిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

హీరోయిన్ జెనీలియా(చిత్ర), వాలీ స్కూల్ అరకు లో టీచరుగా ఒస్తుంది. తను జార్ఖండ్ నుంచి ఒచ్చానని చెప్పటం తో అంత దూరం నుంచి ఇక్కడికి రావటానికి కారణం అడుగుతుంది ప్రిన్సిపాల్. తనకు తల్లీ, తండ్రి, అక్కా, చెల్లి, అన్నా, తమ్ముడు అందరు ఉన్నారని, తాను చాలా పిరికిదని, తనవాళ్ళు గేలి చేయటం తో తన ధైర్యం చూపించటానికే ఇక్కడిదాకా ఒచ్చానని చెప్తుంది. ప్రిన్సిపల్ కు ఉన్న వేరొక ఇంటిలో అమెని ఉండమంటుంది ప్రిన్సిపల్. తన మేనకోడలు సుగుణను తోడిచ్చి ఆ ఇంటికి పంపిస్తుంది.

తన లగ్గేజ్ సద్దుతానన్న సుగుణను పంపించి వేసి తనే సూట్కేస్ తెరిచి సద్దుకుంటుంది. అందులో చాలా మందులు, ఒక టార్చ్, ఒక కత్తి కూడా ఉంటాయ్... .

టీచరు గా మొదటిరోజు స్కూల్ అనుభవం చూడడానికి సరదాగా ఉంటుంది. పిల్లలంతా తనేమి చేస్తే అదే వాళ్ళు చేస్తారు. అల్లరి పిల్లలు. అందుకే వాళ్ళని లొంగదీసుకోటానికి మర్నాడు ఒక తేలుపిల్లను చిన్న సీసాలో పట్టుకొచ్చి అది తన ఫ్రెండ్ సీతామహాలక్ష్మి అని, తన మాట వినని వారెవరన్నా ఉంటే అది కరిచేస్తుందని పిల్లల్ని భయపెడ్తుంది. కావాలంటే అది మాట్లాదుతుందని కొంచెం వెంట్రిలాక్విజం ప్రయోగిస్తుంది. పిల్లలు నిజమే అనుకుంటారు. ఇటువంటి కొన్ని సంఘటనలు సరదాగా అనిపిస్తాయి.

ఈ సినిమా హీరో కృష్ణ ( అరుణాదిత్యా, నూతన పరిచయం) ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ కథకి దర్సకత్వం వహించాలని దాని కోసం చాలా కష్టపడుతుంటాడు. ఇతనితో పాటుగా సినీ ఫీల్డ్ లోని వారే ఇంకా నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక ఇంట్లోనే ఉంటూ ఉంటారు. బయట నేం బోర్డ్ వీళ్ళ పేర్లు ఉండకుండా...మర్డరర్ 1, మర్డరర్ 2, అని అలా అయిదు నంబర్ల వరకు పెట్టుకుంటారు...

ఇతనికి మదర్ సెంటిమెంట్, (అమ్మ, ఒకప్పటి శంకరాభరణం బేబీ తులసి, ఏవిటో అప్పుడే చాలా ముసలిదానిలాగా అయిపోయింది.) పొద్దున్నే గుడికి పోయే అలవాటు ఉంది. అక్కడే చిత్ర ను చూస్తాడు. హీరో కి హీరోయిన్ ని చూపించిన విధానం బాగుంది...

ఇద్దరూ షాపింగ్ లో కూడా కలుసుకుంటారు. అక్కడి దిష్టి బొమ్మను చూసి భయపడుతుంది. అక్కడినుంచి ఇద్దరికీ స్నేహం కలుస్తుంది. ఏమి చదువు రాని వారే సినీ ఫీల్డ్ లో కి ఒస్తారని చిత్ర నమ్మకం. అందుకే కృష్ణని, టెంత్ ఫైలయ్యారా, ఇంటర్ ఫైల్ అయ్యారా? అని అడుగుతుంది. కాని తను ఇంజినీర్ అని చెప్తాడు.
ఇద్దరి మధ్య మెల్లిగా ప్రేమ చిగురిస్తుంది. తను తీయ బోయె 'హత్య ' సినిమా గురించి చెప్తాడు. చిత్ర చాలా తీవ్రంగా భయపడుతుంది. కొన్ని యువతరానికి నచ్చే సంఘటనలు కూడా ఇక్కడ చోటుచేసుకున్నాయి.

అరకులో ఒక సర్కల్ ఇన్స్పెక్టర్ (ప్రకాష్ రాజ్) కూడా ఉంటాడు. అతని స్నేహశీలత, ఉద్యోగ నిబధ్ధత మనల్ని ఆకర్షిస్తుంది.
తన మనవళ్ళతో సరదాగా గడుపుతూ ఉంటాడు. వాళ్ళు ఇతని దగ్గిరే ఉండి అక్కడే చదువుకుంటూ ఉంటారు. అతని భార్య కూడా అతని అడుగుజాడల్లోనే నడుస్తూ ఉంటుంది. పిల్లల్ని స్కూల్లో దింపటానికి ఒచ్చిన సి.ఐ., చిత్రని చూసి ఎక్కడో చూసినట్లుంది అనుకుంటాడు...

మర్నాడు పేపర్ లో చిత్ర ఫొటో తోటి, 'ఈమె ఎవరు?' అనే హెడ్డింగ్ తో వార్త ఒస్తుంది.దానితో సి.ఐ. కి అనుమానం ఒస్తుంది. సి.ఐ. కి చిత్రని ఎక్కడ చూసాడో కూడా గుర్తుకు ఒస్తుంది... హీరో కి కూడా తనకు తెలిసిన ఆమె గురి౦చి చెప్తాడు. అప్పటిను౦చి ఇద్దరూ ఆమె కదలికలని గమనిస్తూ ఉ౦టారు. రాత్రి ఒ౦టరిగా చాలా భయపడుతు, చిత్ర౦గా ప్రవర్తిస్తూఉ౦టు౦ది. కారణ మేంటో?

తరువాత ఒక సాయంత్రం చిత్ర ఒక ప్రియుడు ప్రియురాలిని హత్య చేయటం చూసి సి.ఐ. కి రిపోర్ట్ చేస్తుంది. హీరో కి కూడా ఆ విషయం చెప్తుంది. అందరూ వెతుకుతారు కాని అక్కడ ఏమి కనిపించదు. మర్నాడు దొరికిన ఒక స్త్రీ శవాన్ని మార్త్యురీ లో ఆమెకి చూపిస్తారు. ఈమె, ఆమె కాదంటుంది చిత్ర...

చిత్ర, హీరో ని తన ఇంటికి తీసుకువెళ్ళి తన గతం "చూపిస్తుంది". ఏవిటది?

అక్కడినుంచి కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది.

చిత్ర ఇంట్లో ఎన్నో భయానక సంఘటనలు చోటు చేసుకుంటాయి. దీనికి కారణ మెవరు?

ఆ హత్య అసలు నిజంగా జరిగిందా? జరిగితే హంతకుడెవరు?

పోలీస్ కానిస్టేబుల్ హ౦తకుడెవరో కనుక్కోవటానికి చిత్ర చేసే ప్రతీ ప్రయత్నాన్ని అడ్డుకు౦టూ ఉ౦టాడు. ఎ౦దుకు?

హీరో, చిత్రకి భయమెక్కువ కాబట్టి ఇవన్నీ ఊహించుకుంటుంది అంతే! అవన్ని నిజాలు కావు అని సద్దిచెప్పటానికి ప్రయత్నిస్తాడు. తనకి భయాలు ఉన్నాయి కాని ఇది భ్రాంతి కాదు అని చెప్పటానికి ప్రయత్నిస్తుంది, చిత్ర..

విలన్ మొదటిను౦చి మన కళ్ళము౦దే ఉ౦టాడు. సస్పెన్స్, డిటెక్టివ్ కథలు ఇష్ట పడే వారికి విలన్ ఎవరో సులభంగానే కనుక్కో గలరు. సస్పెన్స్ బాగా కోరుకునే వారికి మాత్ర౦ ఇది నిరాశనే మిగులుస్తు౦ది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఈ మధ్య చాలానే ఒచ్చాయి. కాని వాటిము౦దు ఇది సరిపోదు.

ఈ సినిమా లో ప్రిన్సిపల్ కుమారుడు "కార్తిక్" పాత్ర కూడా ఉ౦ది. మొదటిను౦చి అతడు చిత్రని ప్రేమిస్తూఉ౦టాడు. వెంటాడుతూ ఉంటాడు. ఇతనొక టి.వి. నటుడట. బాగానే ఉన్నాడు. అతను కూడా సినిమాకి ఒచ్చాడు. మా ఫ్రెండ్ అతన్ని చూపించింది.

శ్రీనివాస రాగా దీని దర్శకుడు. పాటలెక్కువగా లేకున్నా ఏం గొప్పగా లేవు.

ఖాళీగా, ఏ౦ పనిలేక పోతేచూసి రావొచ్చు.







"టక టక టక టక ఎవరో! నా మది గది తలుపు తడితే....!"





*********************************************************************

15 కామెంట్‌లు:

రామ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామ చెప్పారు...

(ఇందాకా కామెంట్ లో ముద్రా రాక్షసాలు ఎక్కువ అయి మళ్ళీ పోస్ట్ చేస్తున్నా)
మీరు కర్ర విరగకుండా, పాము చావకుండా ఇచ్చారు రివ్యూ. ఐతే, చివర్లో కి వెళ్ళేకొద్దీ మీరు suspense ఎక్కడ చెప్పేస్తారో అనే భయంతో కొన్ని వాక్యాలు ఎగరగొట్టేసి చదివాను అనుకోండి :).

SRRao చెప్పారు...

జయ గారూ !
మీ సమీక్ష బాగుంది.చివర్లో పాత సినిమాల పాటల పుస్తకాల కథా సంగ్రహాలను, అప్పటి కొన్ని సినిమాల సమీక్షలను ( ముఖ్యంగా చివరి వాక్యం ) గుర్తుచేసింది.

cartheek చెప్పారు...

అక్క ఫిల్మ్ రివ్యూ బాగా రాసారు...

ఈ సినిమా లో ప్రిన్సిపల్ కుమారుడు "కార్తిక్" పాత్ర కూడా ఉ౦ది..
నేనెప్పుడు నటించానబ్బా ఈ సినిమాలో :) :) :)

మాలా కుమార్ చెప్పారు...

ఐతే సినిమా చూడొచ్చు అంటావు . అందుకె ఈ రోజు వెళ్ళి పి .వి .ఆర్ లోనూ , బిగ్ బజార్ లోనూ వెతికి వచ్చా . హూం టికెట్స్ దొరకలే !

మురళి చెప్పారు...

వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే.. ఇప్పుడే మిత్రులెవరినైనా 'కథ' ఎలా ఉందొ అడగాలి అనుకుంటూ బ్లాగ్స్ ఓపెన్ చేశాను.. ముగింపు కొంత వరకూ ఊహించానండీ :):) మీరు చాలా బాగా రాశారు రివ్యూ.. మొదటి రివ్యూ కన్నా చాలా బాగుంది.. ఇలాగే ప్రోసీడైపొండి..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

గుణ్ణం గంగరాజు సినిమాలు ఒకసారి చూసెయ్యొచ్చు అన్నది నా నమ్మకం..సో ఇది కూడా అంత నిరాశపరిచేటట్టు లేదన్నమాట...రోటీన్ రొడ్డ కొట్టుడు ఫార్ములా సినిమాలు చూసి చూసి విసుగుచెందిన ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు కాస్తంత రిలీఫ్ ఇస్తాయనటంలో సందేహం లేదు.

జయ చెప్పారు...

రామ గారు. సస్పెన్స్ సినిమాలో క్లైమాక్స్ బ్రేక్ చేసేస్తే ఎలా? నాకు డిటెక్టివ్స్ చాలా ఇష్టం. చూసిరండి. మీకు ముగింపు తెలిసిపోయిందా? లేదులే:)

జయ చెప్పారు...

రావ్ గారు, మీ పాత సినిమాల ప్రేమ నాకు తెలుసు లెండి. కాని ఒక్కప్పటి "అవేకళ్ళు" లాంటి మాంచ్చి సస్పన్స్ చూసిన థ్రిల్లింగే వేరు.

జయ చెప్పారు...

కార్తీక్ భాయ్, ఏమో...ఆ కార్తీక్, ఈ కార్తీక్ ఒకరేనేమొ? నాకేం తెలుసు. ఎంతైనా...సస్పెన్స్ కదా!



అయ్యబాబోయ్...అక్కా, దయచేసి నువ్వు మాత్రం ఈ సినిమాకి పోకు. నీకు టికెట్ దొరకక పోవటమే మంచిదయింది. ఆ హీరోయిన్ కూడా రక్తం చూస్తేనే ఒణికి పోతుంది..నీ లాగానే:) అవన్నీ చూడలేక సినిమా హాల్ లో పడిపోతే...ఇప్పుడదో కష్టం.

జయ చెప్పారు...

అయితే మురళి గారు, మీరు కథ చూస్తారన్నమాట. చూడండి. నన్నెప్పుడు టపా రాయమంటు ఉంటారుగా మీరెప్పుడు. ఈ టపాలు రాయలేక నేనెక్కడ టపా కడతానో అని నా భయం... ఎంత కష్ట పడ్డానో...అయినా మీకు ముగింపు తెలిసి పోయిందంటున్నారుగా. సర్లెండి, ఇప్పుడొక బుక్ చదువుతున్నాను. రెడీ గా ఉండండి.


పర్లేదులెండి, శేఖర్ గారు ...మీకు ఈ సినిమా తప్పకుండా రిలీఫ్ ఇస్తుంది.:)

శిశిర చెప్పారు...

మొత్తానికి విజయవంతంగా సినిమా రివ్యూ రాయాలని పంతం పట్టారన్నమాట. :) బాగా రాశారు.

జయ చెప్పారు...

ఇంకా ఉన్నాయ్ గా సెలవులు. ఒక బుక్ రివ్యూ కూడా రాసేస్తా:)

భావన చెప్పారు...

బాగుంది జయా రివ్యూ.. కాని నే చూడను గా. నాకు ముందే భయం ఇలాంటి సినిమా లు అంటే చూడటమ్ ఎందుకు రాత్రి కి చీమ చిటుక్కన్నా భయం ఎందుకు అని నేను చూడను. రివ్యూ మాత్రం బాగా రాసేరు.

జయ చెప్పారు...

థాంక్యూ భావనా. కాని అలా చిన్నపిల్లలా భయపడిపోతే ఎలాగమ్మా? ఎంతసేపు కలల భావనలేనా!

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner