3, ఫిబ్రవరి 2010, బుధవారం
ఎక్కుపెట్టిన ప్రశ్నార్థకం...
వినీలాకశమా! అనంతకోటి నక్షత్రాలూ
గాలీ, నీరూ, భూమీ, సమస్త ప్రకృతీ!
మీలో భాగంగా పేరు పడ్డ
ఆ అనామిక ఎవరో?
నిరంతరాయంగా ఏటికి ఎదురీదే
ఆ అభాగిని ఎవరైతే నేం...నా జాతికి ప్రతీక...
మానవత్వం మంటకలిసిన వేళ
ప్రకృతి ఎదురుతిరగడం అనివార్యం
మనం ఎన్నుకున్న కర్తవ్యాల దారుల్లో
గుంతలు పూడ్చెయాల్సేఉన్నది.
ముళ్ళూ, గోతులూ, కొండలూ, గుట్టలూ
ఏ చోటా మన అడుగు వెనక్కి తీసికోకుండా ఉండాలే గాని,
సుదూర తీరాలలోని అందమైన గమ్యం
కాళ్ళ దగ్గరే ఉంటుంది.
నీ కాలి ముల్లును ఎవరో వొచ్చి తీస్తారని ఎదురుచూడకు!
కాలం ఎంత విలువయినదో,
ఇప్పటికి నువు కోల్పోయిన వెతుకులాటలుగాక,
కళ్ళముందున్న అనుభవాలను పంచుకో
ఎవరో నీ చుట్టూ గీసిన నిషేధ నియమాల గిరిలో
నీకు నువ్వే పరిమితుల కచ్చడాలు కట్టుకోకు.
నువ్వే ఏర్పరచుకున్న ప్రపంచంలో ఉష్టృపక్షివైపోతే...
మన స్వప్నాల మరో ప్రపంచం సంగతేంటి?
నీలో చైతన్యాన్ని నింపుకో.
స్వప్నం వాస్తవమై చైతన్యమయం కావాలేగానీ,
ఎక్కుపెట్టిన ప్రశ్నార్ధకమవుతావు నువ్వు
తిరగబడ్డభూమివౌతావు నువ్వు
స్వప్నాలు సిద్ధించే పోరాటమౌతావు నువ్వు...
**********************************************************
లేబుళ్లు:
కవితా భావాలు...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
17 కామెంట్లు:
మీరన్నది నిజం ...
నీలో చైతన్యాన్ని నింపుకుంటే..
అప్పుడు నువ్వు
ఎద విరిసే మల్లె వవుతావు
ఎగిరే పావురాని వౌతావు
మది నింపే మధువు వవుతావు
హృది నిండే వెల్లువవుతావు
గుండె నిండా నువ్వే వుంటావు
గుండె గూటికి గువ్వ వవుతావు
గలగల నవ్వే గవ్వ వవుతావు
ఆ పరమాత్ముని కాలి మువ్వ వవుతావు..
"నీ కాలి ముల్లును ఎవరో వొచ్చి తీస్తారని ఎదురుచూడకు!
కాలం ఎంత విలువయినదో,
ఇప్పటికి నువు కోల్పోయిన వెతుకులాటలుగాక,
కళ్ళముందున్న అనుభవాలను పంచుకో."
Inspiring జయ గారు. చాలా బాగుంది.
జయ గారూ !
ఆలోచింపజేసే మీ రచన బావుంది.
ఎదనింపే చైతన్యం ఎదురీదే సామర్ధ్యం ప్రశ్నిచే పాటవాలను మళ్ళీ గుర్తు చెసినందుకు ధన్యవాదాలు మిత్రమా.
jaya garu mee poetry chala baavundi..meeru lecturer?
శ్రీ లలిత గారు మీరు ఇంకా చాలా బాగా వివరించారు. మీకు ధన్యవాదాలు.
నిజమే కదా! శిశిర, ఎవరికోసమని ఎదురుచూస్తాం. థాంక్స్.
రావ్ గారు ధన్యవాదాలండి.
భావనా, మీరువ్యక్తీకరించిన తీరు చాలా బాగుంది. థాంక్స్.
స్వామి గారు. అవునండి. నేను పాఠాలు చెప్పే పంతులమ్మనే... ధన్యవాదాలండి.
బారాశారు
Thought provoking..
కొత్తపాళీ గారు ధన్యవాదాలండి.
మురళి గారు, Provoking? My goodness! what way?
మీ టపా,శ్రీలలిత గారి వ్యాఖ్య రెండూ బాగున్నాయండీ.
థాంక్యూ ప్రణీత. శ్రీలలిత గారికి కూడా నా ధన్యవాదాలు.
జయ గారూ !మీరు అన్యధా భావించకుంటె
ఎవరో నీ చుట్టూ గీసిన నిషేధ నియమాల గిరిలో
నీకు నువ్వే పరిమితుల కచ్చడాలు కట్టుకోకు......
యిక్కడ ......
ఎవరో గీసిన నియమాలగిరి ని దాటుకొని బయట పడు యికపై నీకు నువ్వే
పరిమితుల కచ్చడాలు కట్టుకోకు ....అని స్ఫూర్తిని అందించి వుంటే బాగుండేది.
మీరు వ్రాసిన పదాలలో.....
ఎవరో నీ చుట్టూ గీసిన నిషేధ నియమాల గిరిలో..... వుంటూనే.... నీకు నువ్వే పరిమితుల కచ్చడాలు కట్టుకోకు.........అని చెప్పినట్లేవుంది. మొత్తానికి మీ ప్రయత్నం అభినందనీయం....శ్రేయోభిలాషి ...నూతక్కి
రాఘవేంద్ర రావ్ గారు, నమస్కారమండి. మీరు చెప్పినట్లుగా అయితే, ఇంకా చాలా వివరంగా ఉంటుంది. ధన్యవాదాలండి.
ఆడపిల్ల అంటే లోకువ, ముందుకు వెళ్తుంటే వెనకకి లాగే వారే తప్ప ఆదరించు వాళ్ళు తక్కువ....మనని మనం నిరూపించుకునే వేళ ఎన్ని పోరాటాలు....
మీరన్నది నిజం రాధిక గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి