13, ఆగస్టు 2011, శనివారం
వరమహాలక్ష్మి దీవించవమ్మా...
మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.
బాగున్నారా....మా అమ్మవారు.
పోయిన సారి ఫొటో తీసుకోలేకపోయాను. పైగా కొన్ని కష్టాలు కూడా ఎదుర్కున్నాను. అందుకే ఈ సారి జాగ్రత్తగా, అసలెక్కడికీ పోకుండా శ్రద్ధగా ఇంట్లోనే అన్నీ చేసుకుంటూ ఉండిపోయాను. మా సుజాత కొడుకు చింటు గాడు, ఈ సారి నాకు అసిస్స్టెంట్. వాడి అక్క సోనీ నా కుడిచెయ్యి. ఆ పిల్ల ఎప్పుడూ నా వెనకాల ఉండాల్సిందే. ఈ పిల్ల నా పెంపుడుకూతురన్నమాట.
ఈ సారి పూజకి నాతోపాటు, మా స్నేహాలయ అమ్మాయిలు నలుగురిని, మా లక్ష్మిని కూడా పిలిచి, అందరం కలసి చేసుకున్నాం. వాళ్ళు ఎంత సంతోషించారో. హుషారుగా అన్ని పనులు వాళ్ళే చేసిపెట్టారు కూడా. చక్కగా తోరణాలు కట్టారు. ముగ్గులేసారు. ఎంతముద్దుగా ఉన్నాయో.
అమ్మవారిని తయారుచేసుకోటానికి చాలా సహాయం చేసారు. ఈ చిన్ని పిల్లలే ఈ సారి నాకు ముత్తైదువులు. వేరే ఎవ్వరినీ నేను పేరంటానికి పిలువలేదు. వాళ్ళే ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకున్నారు. వ్రతకథ చక్కగా విన్నారు. నాక్కూడా వాళ్ళే భోజనాలు వడ్డించారు. అందరం సరదాగా అమ్మవారి కీర్తనలు పాడుకుంటూ భోంచేసాం. ఆ పిల్లల ఆనందం చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోయింది.
సాయంత్రం కూడా చక్కగా మేమందరం కలిసి గుడికి వెళ్ళాం. ఈ రోజంతా చాలా సరదాగా గడిచిపోయింది.
వరలక్ష్మీ దేవి నా ఈ పిల్లలందరినీ కలకాలం సుఖంగా ఉండేట్లు దీవించుతల్లి.....
మీరు కూడా నా పిల్లల్ని దీవిస్తారు కదూ!!!!
వరలక్ష్మీ రావే మా ఇంటికి...క్షీరాబ్ధి పుత్రి...వరలక్ష్మి రావే మా ఇంటికీ.....
***********************************************************************************************************************************************************
లేబుళ్లు:
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
13 కామెంట్లు:
వ్రతం చాలా చక్కగా చేసుకున్నారన్నమాట..
మీ వరలక్ష్మీ అమ్మవారిని నన్ను కూడా దీవించమని చెప్పండి...
మీకు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు...
జయ గారూ !
మీ అమ్మవారు చాలా బాగున్నారు. మీకు వరలక్ష్మీ వ్రత మరియు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు.
బావున్నారండి మీ అమ్మవారు.చాలా బాగా అలంకరించారు
స్నేహాలయ పిల్లల్లాంటి వారిని ముత్తైడువులుగా ఆదరించిన మీ సంస్కారానికి వేల నమస్కారాలు. ఆచారం పేరుతో మన తోటి వారికే భోజనం పెట్టటం, చీరలు పెట్టటం లాంటి రొటీన్ పనులు చేయకుండా ఆ పిల్లలని ఆదరించినందుకు మీకు పది రెట్లు పుణ్యం. రక్షా భాధాన్ శుభాకాంక్షలు !!
క్రితం సంవత్సరం పండక్కి మీరు కేమెరా పుచ్చుకుని బయట కెళ్ళినప్పుడు అయిన అనుభవం నాకు బాగా గుర్తుంది. ఆ అనుభవం చెప్పిన పాఠం అన్నమాట.. మీరు ఈ యేడు చక్కగా చేసుకున్నారు. మీ అమ్మవారు చాలా కళగా ఉన్నారు.
స్నేహాలయ పిల్లల్ని పిలిచి చేసుకున్న పూజ అంటే చాలా గొప్పదన్నమాట.
ఆ అమ్మవారి ఆశీర్వచనం మీకూ, ఆ పిల్లలకీ కూడా ఉండాలని ఆశిస్తున్నాను.
చాలా బాగుంది!
మీ అమ్మవారు చాలా బాగున్నారు.మీ వరలక్ష్మీ అమ్మవారిని నన్ను కూడా దీవించమని చెప్పండి!
అమ్మవారు బావున్నారండి. మా అత్తగారికి కూడా చీర అమ్మవారికి కట్టడం అలవాటు ఉండేది. ఒకసారి మొదలెడితే ఎప్పుడూ చెయ్యాలి, అందుకని మీరు ముఖం ఒక్కటీ అయినా పెట్టుకోండి చాలు అని మా కోడళ్ళకు కన్సెషన్ ఇచ్చేసారు మా అత్తగారు. పాపతో చీర కట్టడం అవి కుదరవని నేనూ ముఖరూపం కొనేసి కలశానికి అది పెట్టి పూజ చేసేస్తున్నానండీ. బెజవాడలో మాకు తెల్సిన ఒకావిడ ఎంతో బాగా అమ్మవారిముఖాన్ని తయారు చేసేవారండి..ఆవిడ అలంకరణ చూట్టానికి వాళ్ళ పేరంటం మాత్రం నేను మిస్సయ్యేదాన్ని కాదు. నిజంగా మనిషి ఉన్నట్లే ఉండేది ఆ రూపం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆవిడను తల్చుకుంటూ ఉంటాను..
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం!!
ఇంత భక్తిగా పూజ చేశాక అమ్మవారు కరుణించకుండా ఉంటుందా చెప్పండి?
ఆత్రేయ గారి వ్యాఖ్యే నాదీనూ. ఇదే మీ దగ్గర నుండి నేర్చుకోవాలన్నది. క్రితం సంవత్సరంలా ఏ గాభరాలూ లేకుండా హాయిగా పిల్లలతో కలిసి పూజ చేసుకున్నారన్నమాట. సంతోషం. మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
రాజీ, రావ్ గారు, లత గారు, ఆత్రేయ గారు, శ్రీ లలిత గారు, కృష్ణప్రియ గారు, తృష్ణ గారు, సునిత గారు, మురళి గారు, శిశిర...మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
జయగారు,
మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
Thankyou Sri.
కామెంట్‌ను పోస్ట్ చేయండి