10, నవంబర్ 2009, మంగళవారం

ఇదెక్కడి న్యాయం!





రాబోయె ఎలక్షన్స్ లో ట్రైనింగ్ క్లాసెస్ కి, పోలింగ్ కి, కౌంటింగ్ కి మా కాలేజ్ తీసేసుకుంటారు. దీని మూలంగా మా అల్మనాక్ బాగా డిస్టర్బ్ అవుతుంది. అందుకని, కనీసం పోలింగ్ ఆఫీసర్ల ట్రైనింగ్ క్లాసులన్న ఇంటర్ బిల్డింగ్ లో వీలైతుందేమొ, అక్కడి ఆడిటోరియం చెక్ చేసిరమ్మని మా ప్రిన్సిపల్ అడిగారు. అందుకని, నేను అనుకోకుండా మా ఇంటర్మీడియట్ బిల్డింగ్ కి వెళ్ళాను. క్లాస్ రూంలు చూసుకుంటూ లైబ్రరీ కి వెల్తున్నాను. అన్ని క్లాసులు చాలా సీరియస్ గా జరుగుతున్నాయి. ఒక క్లాస్ లో మాత్రం ఓ పదిమంది అమ్మాయిలు ఖాళీగా ఉన్నట్లున్నారు, ఉప్పరి మీటింగ్ పెట్టేసుకున్నారు. నా కెక్కడైనా పిల్లలు ఖాళీగా కనిపిస్తే అక్కడ దూరిపోవటం అలవాటు. ఇంకా ముందుకి పోలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. పాపం, ఆ పిల్లలు నన్నుచూసే సరికి వాళ్ళమాటలు ఆపేసి, నిలబడిపోయారు. అంతవరకు హాయిగా మాట్లాడుకుంటున్న వాళ్ళ మూడ్స్ పాడుచేయటం నాకిష్టం లేదు. అయినా, నాకు వాళ్ళని వొదలాలనిపించలేదు. ఏమర్రా, మీ కే క్లాస్ లేదా ఇప్పుడు అన్నాను. మాకు ఇప్పుడు లీజర్ మేడం అన్నారు. ఒహో! అయితే ఏం మాట్లాడు కుంటున్నారు, దేనిమీద మీ డిస్కషన్ అంటూ వాళ్ళలో చేరిపోయాను, నేను ఒచ్చిన పని పక్కనపెట్టేసి.

వాళ్ళకెన్నో కబుర్లుంటాయ్, అవి నాకెందుకు చెప్తారు. వాళ్ళు చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తున్న టాపిక్ 'పెళ్ళిచూపులు' గురించి. కాని, ఒకమ్మాయ్ వెంటనే అనేసింది మేడం, మా ఫ్రెండ్ కి రేపు పెళ్ళిచూపులట...అది ఏడుస్తోంది, అంది. నిజంగానే నాకేం తోచలేదు. అప్పుడే వీళ్ళకి పెళ్ళేంటి. వెంటనే ఇంకో అమ్మయి అంది. మేడం, మా అక్కయ్యని మా బావ మా ఇంటికి పంపించేసాడు. రోజూ ఏడుస్తుంది... అంది. మేడం. ఈ మొగవాళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదు మేడం, నేనైతే పెళ్ళే చేసుకోను..మా వాళ్ళకి చాలా గట్టిగా చెప్పేస్తాను...అంది, ఇంకో అమ్మాయి. ఇలా వాళ్ళు రకరకాల కామెంట్స్ మొదలు పెట్టారు. వాళ్ళు ఉపయోగిస్తున్న మాటలు గాని, పెళ్ళి పట్ల వాళ్ళ అభిప్రాయాలు కాని వింటూ ఉంటే నాకు కళ్ళు గిర్రున తిరిగిపోయాయి. ఒక్క అమ్మాయి కూడా పెళ్ళికి అనుకూలంగా మాట్లాడలేదు. అనుకోకుండానే అక్కడ ఒక పెద్ద డిబేట్ జరిగి పోయింది.

పదిహేను, పదహారు సంవత్సరాల వయసున్న ఈ పసి పిల్లలు, శారీరకంగా...మానసికంగా ఎన్నో మార్పులకు లోనవుతున్న ఈ సున్నిత దశలొ వాళ్ళకి పెళ్ళి పట్ల ఇంతటి విముఖత ఏర్పడితే...వాళ్ళ భవిష్యత్తేమిటి..అని దిగులేసింది. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న ఈ లేత కళ్ళు కలవరపడిపోతే ఎలా! సరి అయిన అవగాహన ఎలా రావాలి? వీళ్ళ జీవితంలో అందమైన అనుభవాలు పొందాలంటే ఏం చేయాలి... కాని, వాళ్ళ ప్రస్తుత పరిస్తితుల పరిశీలన...జరుగుతున్న అనేక సంఘటనలు వాళ్ళ ధైర్యాన్ని, నమ్మకాన్ని మింగేస్తున్నాయ్. ఒకళ్ళ తరువాత ఒకళ్ళు చాలా తీవ్రమైన భావాలు వ్యక్తీకరించారు. నేను మాట్లాడిన ప్రతీ మాటకి వాళ్ళు ధీటైన సమాధానం ఇస్తున్నారు.

మాట్లాడటమే కాని వినే అలవాటు లేని ఉద్యోగం నాది. అటువంటిది వాళ్ళముందు మూగదాన్నై పోయాను. ఆ చిన్న పిల్లల భావాలను చాలా మటుకు యధాతధంగా మీ కందిస్తాను. ఎప్పుడూ కాలేజ్ గురించే మాట్ల్లాడుతుంది...అంటారా! నాకు ఇక్కడే మొత్తం 'ప్రపంచం' కనిపిస్తుంది... మరి ఇదే కదా నా లోకం... "ఇదెక్కడి న్యాయం" అన్నది వాళ్ళ ప్రశ్న...


*****ఇదెక్కడి న్యాయం ******

రండి, రండి అందరూ లోనికి రండి
స్వచ్చమైన నేతి మిఠాయిలు తినండి
పళ్ళూ, ఫలహారాలు ఆరగించండి
అమ్మాయిని ముస్తాబు చేస్తున్నారు
ఓ పెళ్ళిచూపుల కొచ్చిన పెద్దలూ ముందు ముందుకొచ్చి కూర్చోండి
కాఫీలు, టీలు సేవించండి
అదిగో అమ్మాయిని తీసుకొచ్చారు
పిల్ల లక్షణంగా లక్ష్మి లా ఉంటుంది
పట్టుకుచ్చులాంటి పొడువైన కురులతో
ఆడపడుచులు ఎంత లాగాలన్నా లాగొచ్చు
వెన్నముద్దలాంటి ముఖం, పువ్వులాంటి కోమలత్వం
మొగడు సిగరెట్లతో ఆనందంగా కాల్చేయొచ్చు
తీర్చిదిద్దిన అంగసౌష్టవం
బావలో, బావమరుదులో అసభ్యంగా చూసి, చూసి
వంటిగా వంటగదిలో కొంగు పట్టి లాగొచ్చు
బంగారు రంగులో నాజూకు నడుము
జల్సాలకు డబ్బు అవసరమైనప్పుడల్లా వాతలు పెట్టొచ్చు
అందమైన శరీరం
అత్తమామలు కిరోసిన్ పోసి అంటించ ఒచ్చు
కమ్మగా పాడే గొంతును ఇంటిల్లిపాదీ సీలింగ్ ఫాన్ కు ఉరి తీయవచ్చు
ఇంకా బాగా పరీక్షించుకోండి
గుడ్డిది కాదు, మూగది కాదు
మీరెన్ని కుట్రలు పన్నినా చూడదు
ఎన్ని తిట్టినా మాట్లాడదు
అయినా పిల్లల్ని కని వంశాభివృద్ధి చేస్తుంది...

ఇవి ఏవీ కూడా నా భావాలు కావు. కాని ఈ పిల్లలు నాకు తీసుకున్న క్లాస్ చూస్తే మాత్రం నాకిలా అనిపించింది. "నెల రోజులు గ్రంధ పఠనం లో సంపాదించే జ్ఞానాన్ని పండితునితో గంట కాలం సంభాషించడంతోనే పొందవచ్చు" అని అర్ధమైంది. ఇవి నేను తెలుసుకున్న వాళ్ళ "అనుభవాల పాఠాలు".


*************************************************************

28 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

నాణేనికి బొమ్మా బొరుసూ ఉన్నటే లోకంలో మంచీ చేదూ ఉంటాయనీ.. కేవలం చెడుని/మంచిని మాత్రమే చూడడం తప్పనీ.. గతం లో కన్నా అమ్మాయిలకి ఇప్పుడు నిర్ణయం తీసుకుని విషయంలో స్వేచ్చ పెరిగిందనీ.. ఆర్ధక స్వాతంత్రం సంపాదించుకుంటే ఇష్టం లేని బంధంలో బలవంతంగా కొనసాగ నవసరం లేదనీ.... వాళ్లకి మీరు చెప్పి ఉండాల్సిందండీ....

జయ చెప్పారు...

మురళి గారు ఇక్కడ ఆర్ధిక స్వేచ్చ గురించి కాదు వాళ్ళ బాధ. ఇష్టం లేని వివాహ బంధం నుంచి బయటకు రావటం కూడా కాదు. ఎన్ని చదివినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఆడపిల్లకు మానసిక వొత్తిడి తప్పటంలేదు అన్నది వాళ్ళ దిగులు. స్థిరమైన వివాహ బంధాలు ఏర్పడటం లేదు అన్నది వాళ్ళ గాఢ నమ్మకం. ఎన్ని విధాలుగా చెప్పినా వాళ్ళ అనుభవాలనే చూపిస్తున్నారు. అన్ని బాధలు పడటం ఎందుకు, బయటికి రావటం ఎందుకు...స్వేచ్చగా ఒంటరిగా బ్రతకాలన్నదె వాళ్ళ నిర్ణయం. ఇది ఎంతమటుకు సమర్ధనీయం?

శిశిర చెప్పారు...

నేను ఎప్పుడూ నా వ్యక్తిగత విషయాలగురించి బ్లాగులో రాస్తానని అనుకోలేదు. నా పోస్ట్ ను చదవమని అందరినీ అడుగుతానని అసలనుకోలేదు. కాని నేను పడుతున్న బాధను భరించలేక, ఎవరితో చెప్పుకోవాలో అర్ధం కాక హఠాత్తుగా ఒక బ్లాగు క్రియేట్ చేసి నా బాధను ఒక పోస్ట్ గా రాసాను ఈరొజే.
నేనేమీ ఈ పిల్లల వయసులో వున్న అమ్మాయిని కాదు. నా పోస్ట్ ను చూసి మీ అభిప్రాయం చెప్పండి.
నా బ్లాగు http://jadivaana.blogspot.com/

Hima bindu చెప్పారు...

నిజానికి పూర్వంకంటే మన వివాహవ్యవస్తలో చాల మార్పులే చోటుచేసుకున్నాయి ,ఇప్పటివారికి కనీసం స్వేచ్చగా పెద్దలకి చెప్పే స్వాతంత్ర్యం వుంది ,నచ్చకపోతే ఆ భంధం నుండి స్వేచ్చగా బయటికి వస్తున్నారు ఇరువైపులా సమర్ధిస్తున్నారు కూడాను .

జయ చెప్పారు...

శిశిర గారు, మీ బ్లాగ్ చూశాను. ఇంత చిన్న అనుభవానికే, మనసు చెదిరి, బెదిరిపోతే ఎలా! ఆర్ధిక స్వాతంత్ర్యం ఉందికదా. మీ కుటుంబ బాధ్యతలు కొనసాగించండి. ఏనాటి కైనా మీ భావాలకు అనుగుణమైన వ్యక్తి దొరక్క పోడు. అందరూ అలాగే ఉండరు కదా. ఇప్పుడు మగవాళ్ళలో కూడా చాలా మార్పు వొచ్చింది. వాళ్ళు కూడా వివాహ వ్యవస్థ లోని మధురిమ కోరుకుంటున్నారు. వివాహ మన్నది ఆడ, మగ ఇద్దరికీ అవసరమే. మీ బాధ్యతను గౌరవించే వాళ్ళు తప్పకుండా దొరుకు తారు. ఇద్దరూ కలిసి రెండుకుటుంబాల బాధ్యత సంతోషంగా కొనసాగించ వచ్చు. తొందరపడకుండా, మంచి తరుణం కోసం వేచి ఉండాలి. అంతే కాని వివాహం మీద విముఖత్వం పెంచుకుంటే ఎలా! జీవిత కాలపు ఒంటరితనం భరించటం ఇంకా కష్టం. ఇప్పటి మనోబలం క్రమంగా తగ్గిపోతుంది. 'కుటుంబం' ద్వారా వొచ్చే 'బలం' ఎంతటి కష్టాన్నైన ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. I wish you all the best for your bright future & to have a happy married life.

జయ చెప్పారు...

అవును చిన్ని గారు, మీరు చెప్పింది నిజం. ఇప్పుడు స్వాతంత్రమే కాదు, తమ జీవితాలను చక్కదిద్దుకొనే చాకచక్యం కూడా మెండు గానే ఉంది. వాళ్ళకు ఏం కావాలో చక్కగా ప్రణాళిక లు రూపొందించుకుంటున్నారు. పాతకాలపు అమ్మాయిల్లాగ వీళ్ళు బేలలు కారు. వింటున్నారా! శిశిరగారు, చిన్ని గారు ఏం చెప్ప్తున్నారో...

శిశిర చెప్పారు...

Thanks for Your support and wishes jaya garu.
"ఇప్పుడు మగవాళ్ళలో కూడా చాలా మార్పు వొచ్చింది."
వచ్చే ఉండచ్చు కాని ఇప్పటిదాకా నాకు అలాంటివారెవరూ తారసపడలేదు.

"మీ బాధ్యతను గౌరవించే వాళ్ళు తప్పకుండా దొరుకు తారు".
నా భావాలని అర్థం చేసుకునేవాడు,నా బాధ్యతలను గుర్తించి గౌరవించేవాడూ దొరికేలోగా ఒక నలుగురైదుగురు ఇలాంటి వాళ్ళు తగిలితే నేను చెప్పక్కరలేకుండానే నా భావాలు విశ్వవ్యాపితమైపోతాయనే నా బాధంతా. :)

శిశిర చెప్పారు...

"ఇక్కడ ఆర్ధిక స్వేచ్చ గురించి కాదు వాళ్ళ బాధ......................... అన్ని బాధలు పడటం ఎందుకు, బయటికి రావటం ఎందుకు".

జయ గారూ....ఎంతవరకు సమర్ధనీయమో నేను చెప్పలేను కానీ నా అభిప్రాయం అదేనండీ.

సుభద్ర చెప్పారు...

shishira gaaru,
mee blog link naaku doraka ledu..try chesaanu.please malli naaku pampagalaraa??

జయ చెప్పారు...

శిశిర గారు, తొందర పడకండి. నెగెటివ్ ఉద్దేశాలను కొంత కాలం పక్కన పెట్టండి. మీరు ప్రస్తతం ఎవరి మాట విన దలుచుకో లేదు...అంతే కదూ... ప్రస్తుతం పెళ్ళి గురించి ఆలోచించకండి. మిమ్మల్ని అన్ని విధాలా ఇష్టపడే వారు మీకు తప్పకుండా దొరుకు తారు. ఇష్టపడ్డ వారున్నప్పుడు, ఆర్ధిక స్వేచ్చ మాత్రమే కాదు దానికి అనుబంధంగా కావలసిన వన్నీ, వాటంతట అవే దొరుకుతాయి. మీ బాధ్యతలు తీరిన తరువాతైనా మీకు తోడు కావాలి. నిరాశా, నిస్పృహలు మనిషిని కృంగదీస్తాయి. సరి అయిన రీతిలో ఆలోచించనియ్యవు. మీకు ఇక్కడ చాలా మంది స్నేహితులున్నారు. కూడలి లోకి రండి. మీకు హృదయపూర్వక స్వాగతం.

శిశిర చెప్పారు...

@సుభాద్ర గారూ, మీకు నా పోస్ట్ లింక్ మైల్ చేశాను. ధన్యవాదములు.
@జయ గారూ, మీ ఆహ్వానానికి ధన్యవాదములు. నా ఆలోచనలను, భావాలను తప్పకుండా మన బ్లాగ్మిత్రులతో పంచుకుంటాను. నా పూర్తి వివరణతో నా బ్లాగు లో ఒక పోస్ట్ రాస్తాను.

మాలా కుమార్ చెప్పారు...

జయ ,
మీ కాలేజ్ లో కుటుంబవిలువల గురించి కూడా ఒక క్లాస్ పెట్టాలేమో . పిల్లలకు మరీ ఇంత వ్యతిరేకభావాలు వుండటము మంచిది కాదు. ఇదంతా మీడియా పుణ్యమేమో !
శిశిర గారు ,
మీరు మరీ నిరాశ లో వున్నట్లున్నారు . మీ అదృష్టం అలాటి పెళ్ళికొడుకు తప్పి పోవటము . ఈ కాలము లో అల్లాంటి అబ్బాయిలు చాలా తక్కువ . చాలావరకు అబ్బాయిలు , అత్తగార్లు అమ్మాయిలని అర్ధం చేసుకొని సహాయ సహకారాలు అందిస్తున్నారు . మురళి గారు అన్నట్లు నాణానికి బొమ్మ , బొరుసు రెండూ వుంటాయి . బొమ్మని చూడటానికి ప్రయత్నించండి .

కొత్త పాళీ చెప్పారు...

wow .. bravo.

చెలం తిట్టాడూ అంటే సమాజాన్ని, తిట్టడూ మరీ? చెలం కథల్రాసిన తరవాత యెనభయ్యేళ్ళకి ఇంకా యీ అధోగతిలో వున్నాం మనం!

జయ చెప్పారు...

వాళ్ళ అనుభవాల ముందు, కాలేజ్ లో క్లాసులు ఏమూలకి అక్కా!

జయ చెప్పారు...

కొత్తపాళీ గారు మీరు చెప్పింది అక్షరాల సత్యం. థాంక్యూ.

Anil Dasari చెప్పారు...

@కొత్తపాళీ:

మరీ అంత అధోగతిలో ఏమీ లేము :-) అమ్మాయిల్ని పరదా మాటున కానీ ఇల్లు కదలనీయని ఘోషా దశ నుండి, పీలికలతో టెలివిజన్ తెరలమీద గంతులేస్తుంటే తల్లిదండ్రులు ఆనందబాష్పాలు రాలుస్తూ కరతాళధ్వనులతో ప్రోత్సహించే దశ దాకా వచ్చింది - చలం కోరుకున్న 'మంచి మార్పు'.

@జయ:

పై టెలివిజన్ ఉదాహరణతో మీకు ఒళ్లు మండిందేమో. అందరూ అలాంటివారే ఎలాక్కాదో, అందరూ మీకెదురైన విద్యార్ధినుల్లాంటి అబలలూ కారన్నది చెప్పటమే నా ఉద్దేశం.

>> "ఎన్ని చదివినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఆడపిల్లకు మానసిక వొత్తిడి తప్పటంలేదు అన్నది వాళ్ళ దిగులు"

మానసిక ఒత్తిడి మగపిల్లలకి మాత్రం ఉండదా? ఎంత చెట్టుకి అంత గాలి. నేటి సగటు మధ్యతరగతి అమ్మాయిలు టపాలో చెప్పినంత దీనంగానైతే లేరు. మీకు తగిలిన అమ్మాయిలది ఓ కోణం. దీనికి పూర్తి భిన్నమైన అమ్మాయిలే నాకెక్కువగా తగిలారు. అందరూ మీరెరిగిన వాళ్లలా ఉండరు, నేనెరిగిన వాళ్లలానూ ఉండరు.

భావన చెప్పారు...

పిల్లలు చిన్న పిల్లలు కదండి జయా ఆ టైం లో భావాలు కొంచం తీవ్రం గా వాళ్ళకు ఎదురైన ఒక్క అనుభవం తోనే జీవితం మొత్తాన్ని నిర్ణయిస్తారు, కాని ఒక విధం గా అందరం అంతే కదా మనం చూసిన జీవితాలను బట్టి మనకు ఎదురైన అనుభవాలను బట్టి మన జీవితపు కోణాలను ఏర్పరుచుకుంటాము. ఎక్కడో మహానుభావులు వుంటారు నేను మాట్లాడేది మన వంటి సామాన్యుల గురించి. మాల గారు మురళి గారన్నట్లు జీవితపు రెండో పార్శ్వాన్ని అర్ధం చెయ్యగలిగితే బాగుంటుందేమో కదా...


@ అబ్రక దబ్ర గారు:
అందరు ఒకలా వుండరు ఏ సమాజం లోను.. కాకపోతే మనం ఎక్కువ మంది ని అలా చూసినప్పుడు అయ్యో అని బాధ పడతాము. అదే జయ గారు చేసేరు 100% అలా వుంటారని కాదు. చలం ఎప్పుడూ జనాలను గుడ్డపీలిక లు వేసుకుని ఎగరమనలేదు.. శరీరానికి తగిన గౌరవమివ్వమన్నాడు. మీరెలా చలాన్ని ఇలా అర్ధం చేసుకుని ఒక తీవ్రమైన విసురు విసిరారో ఆ పిల్లలు కూడ అలానే అని వుంటారు..

నీహారిక చెప్పారు...

jaya gaaru,

నాది కూడా అబ్రకదబ్ర గారి అభిప్రాయమే.మీరు చూసిన పిల్లలు ఇంకా ఎదగలేదు అనిపిస్తుంది.బయట అలా లేరు.చలం సాహిత్యం ఏం పనికివస్తుంది వాళ్ళ ముందర అని అనిపిస్తుంది.ఆకలేస్తే అన్నం పెడతా... అని పిల్లలు dance వేస్తుంటే చూసి ఎంత బాధ వేస్తుందో?మరి ఆ తల్లితండ్రులు ఎలా enjoy చేస్తారో అనిపిస్తుంది.

జయ చెప్పారు...

అబ్రకదబ్ర గారు, భావన, నీహారిక గారు ధన్యవాదాలు. ఈనాటి ఆడ పిల్లలు తెలివైన వాళ్ళే. ఎంతమాత్రం కాదనను. కాని తగలబడిపోతున్న ఆడపిల్లల్ని చూసి భయపడే అమాయకులు కూడా ఉన్నారు కదా! ఎవరి అనుభవాలు వారివి. ఏమీ తెలియని టెండర్ ఏజ్ లో భయపడే పిల్లల్ని నేను ఎక్కువగా చూస్తున్నాను కాబట్టి నా భయమల్లా ఆ అమయకపు పిల్లల గురించి మాత్రమే. అన్నీ తెలిసిన తెలివైన వాళ్ళకి చెప్పేదేముంది.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

కాలం మారింది..అమ్మాయిలు ఈ విధంగా లేరు అన్నది కొంతమంది మిత్రుల అభిప్రాయం..కానీ ఎంత శాతం మంది అమ్మాయిలకి స్వేచ్చ, సొంత నిర్ణయం అమలు పర్చగల పరిస్థితులు ఉన్నాయన్నది నా ప్రశ్న. బాగా చదువుకున్న వాళ్ళకి కూడా పెళ్ళి మీద విముఖత ఉండటం చూడవచ్చు. ఆర్ధిక స్వాతంత్ర్యం ఉన్నంత మాత్రాన ఇంకొకల్ల వేధింపులు తప్పవని గ్యారెంటీ ఏమీ లేదు..
చాలా వరకు పెళ్ళి విషయంలో ఆడవారి సమస్యలకు ఎక్కువ భాగం ఆడవారే(ఓ అత్తరూపంలో..తోడికోడలు రూపంలో..ఆడపడుచు రూపంలో..etc) ప్రత్యక్షంగా/పరోక్షంగా కారణం అన్నది నా అభిప్రాయం.

జయ చెప్పారు...

శేఖర్ గారు, ఆడ వాళ్ళకు ఆడవాళ్ళే శత్రువు లంటారు. కరెక్టే గాని కొంత భాగం మొగవాళ్ళకు కూడా ఉంది. అన్నిరకాల ఆడవాళ్ళు ఉన్నట్లే అన్నిరకాల మగవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మయిల స్వేచ్చ గురించి మీ అభిప్రాయం చాలా బాగా చెప్పారు. ఎక్కువ శాతం జరుగుతున్నది ఇదే.

తృష్ణ చెప్పారు...

ఒక మంచి విషయాన్ని చూపారండీ...మనకు ఆ వయసులొ లెని ఆలొచనల స్పష్టత ఇవాల్టి పిల్లలకు ఉందండీ...
మిగిలినవన్నీ అందరు రాసేసారు....కానీ కొన్ని ఉదాహరణలను మనసులో పెట్టుకుని వాటి వల్ల వివాహమనే అమ్దమైన బంధాన్ని కాదనుకోవటమ్ నిజంగా తప్పనే నా అభిప్రాయం...జీవితంలో ఒక తోడు ఎంత అవసరమో పిల్లలకు తెలపాల్సిన భాద్యత తల్లిదండ్రులకు ఎంతైనా ఉందండీ...

కమల్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కమల్ చెప్పారు...

"ఏనాటి కైనా మీ భావాలకు అనుగుణమైన వ్యక్తి దొరక్క పోడు. అందరూ అలాగే ఉండరు కదా. ఇప్పుడు మగవాళ్ళలో కూడా చాలా మార్పు వొచ్చింది. వాళ్ళు కూడా వివాహ వ్యవస్థ లోని మధురిమ కోరుకుంటున్నారు"

ఏంటి ఈ వ్యాక్యానాలు..? నాకు నవ్వొస్తుంది ఇలాంటివి వింటుంటే.." మగాళ్ళు మారారు " అన్న పదం మరీ జనరలైజ్ చేసినట్లుంది., ఏదో స్త్రీ వాద సినిమాలో ఒక డైలాగ్ ఉంది అందులో ఒక మగవాడు ఒకమ్మాయి ప్రవర్తనని బట్టి మాట్లాడుతూ" మీ ఆడాళ్ళు " అంటూ మొదలెడితే అతని మాటలు మధ్యలోనే కట్ చేస్తూ ఆ అమ్మాయి " ఆ అనేదేదొ నన్ను అను,అంతే గాని మొత్తం స్త్రీలందరినీ ఎందుకంటారు " అని ప్రశ్నిస్తుంది ఆ స్త్రీ పాత్ర. అది నిజమే కదా అనిపించింది..! మరి ఇక్కడ కూడ మీరు అలానే అంటున్నారు ఎవరో ఒక మగాడు ఏదో చేస్తే మిగతా ప్రపంచం లోని మగాళ్ళూ" అని అనడం ఎంత వరకు సబబు..?, ఇక మీ కాలేజిలోని అమ్మాయిల సంగతి చూస్తుంటే అది నిజంగా వారి తప్పే సరిగ్గా మానసికంగా ఎదిగిఎదగనీ వయసులోని అభిప్రాయాలు ఏర్పరుచుకున్నారు..! అయినా ఇప్పుడున్న అభిప్రాయాలు కాలం మారెకొద్ది మారుతూ ఉంటాయి, అలాగే మగాళ్ళు కూడ మీ కాలేజిలో అనుకుంటున్న అమ్మాయిలాగ అనుకునే వారిని చాలా మందిని చూడొచ్చు అంత మాత్రాన ఆడోళ్ళు అందరూ చెడ్డవాళ్ళు అయిపోరు, అసలు ఈ ప్రపంచం ఏ ఇద్దరి భావాలు కాని లేక అభిప్రాయాలు గాని కలుస్తాయా..? అలా కలవడానికీ అవకాశముందా..? అలా ఎలా ఆశిస్తారు..అర్థమే కాదు, ప్రతి మనిషికి సొంత ఆలోచనలూ, అభిప్రాయాలు ఉంటాయి, అవి ఇంకొకరితో కలవవు..అలా కలవాలని ఆశించడం కూడ అంత సబబు కాదేమో, అలాంటిది ఎలా ఉంటారు ఒకే అభిప్రాయం, ఆలోచనలు కలిగిన మనుషులు..? ఎందుకుండాలి..విభిన్న మనస్థత్వ మనుషులుంటే ఏమిటి పొరబాటు..? ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించండి..పోనీ అది చేత కాకపోతే ఇంకొకరి అభిప్రాయల్లోకి తొంగచూడకండ ఎవరికి నచ్చినట్లు వారుంటే సరిపోతుంది కదా..? ముందు మనుషులు " ఆశించడం ( ఎక్స్ పెక్టేషన్స్ ) అన్న వాటికి దూరంగా ఉంటే అసంతృప్తులు, మానసిక వత్తుడులు ఉండవు..! ముందు ఆవిధంగా ఎదిగితే ఇంకే గొడవలు ఉండవు, ఇప్పటికే ముంబాయి లో గత పదేళ్ళుగా " ఒంటరి తల్లులు " ఎక్కువయ్యారు. దానికి కారణం మీ కాలేజీమ్మాయిలాంటి ఆలోచనా విదానాల్లో ఉండడం వలన..!

నేస్తం చెప్పారు...

నేను రెండు రకాలుగా ఉన్న వాళ్ళను చూసాను జయ గారు.. మగ పిల్లవాడు పుట్టేవరకూ కనాల్సిందే అని ఒక అమ్మాయి చేత వరుసగా ఆడపిల్లలను కనిపించి ఇప్పుడు నీకు నాకు సంభందం లేదని ఉన్న ఉద్యోగం సైతం మానేసి మానసికం గా శారీరకం గా వేధించిన అబ్బాయిలూ ..భార్యకు మత్తు ఇచ్చి జాగ్రత్తగా AIDS వ్యాది గ్రస్తుని రక్తం ఎక్కిస్తూ పట్టు పడిపోయిన వాడిని ఇలా మా బంధువుల్లోనే చూసాను..
అలాగే పెళ్ళి కి ముందు ఇష్టం వచ్చిన అబ్బాయిలతో తిరుగుతూ ,పెళ్ళి సమయానికి వేరొక వాడిని చేసుకున్న అమ్మాయిలూ ,పెళ్ళయ్యాక అత్త ,మామలను పురుగుల్లా విదిలించిన వారినీ చూసాను.. కాక పోతే మన చుట్టు ప్రక్కల జనాలు,కుటుంబాల బట్టి ఈ నిష్పత్తుల హెచ్చు తగ్గులు ఉంటాయి.. నా వరకూ నేను ఎక్కువ శాతం అమ్మాయిల బాధలే చూసాను .

జయ చెప్పారు...

అవును తృష్ణ గారు, ఏమీ తెలియని వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఇవాళ పెళ్ళికి భయపడుతారు. రేపు ఒంటరి తనాన్ని కూడా తట్టుకోలేరు. ఇటువంటి వాళ్ళు మంచి అవగాహన కొసం ప్రయత్నించాలి. మనలాంటి వాళ్ళు వీలైనంత సహాయం చేయాలి.

జయ చెప్పారు...

కమల్ గారు, నేను కూడా అదే చెప్తున్నాను. ఆడవాళ్ళందరు మంచి వారు అలాగే మగవాళ్ళందరు చెడ్డవారు కారు. ఎవరి అనుభవం బట్టి వారి అభిప్రాయాలు ఏర్పడుతాయి.

జయ చెప్పారు...

నేస్తం గారు, మీరు చెప్పే విషయాలు చూస్తుంటే వొళ్ళు గగుర్పొడుస్తోంది. సమష్యలు లేని ఆడవారి కన్నా ఎన్నో బాధలు పడుతున్న ఆడావరే ఎక్కువ ఉన్నారనిపిస్తుంది. చాలా మంచి అవగాహన తోటి చెప్పారు.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner