17, నవంబర్ 2009, మంగళవారం

స్పెషల్ బంపర్ ఆఫర్!


అవకాశం ముందుగా ఒచ్చిన 2000 మందికి మాత్రమే!

ఇంగ్లీష్ లో సులభంగా మాట్లాడండి.

లెటర్ రైటింగ్ ప్రాక్టీస్ మా ప్రత్యేకత (ఇంగ్లీష్ లో ఉత్తరాలు వ్రాసే పద్ధతి).

స్పెషల్ బంపర్ ఆఫర్ కూపన్ ఇస్తున్నాము...దీన్ని నింపి పంపండి...అంతే!

రూ 200/- పంపినచొ మీకు ఉచిత పోస్టల్ శిక్షణ ఇవ్వబడును.

(రోజుకు ఖర్చు రూ 3/- మాత్రమే! ఇంకా ఇతర కోర్స్ లు కూడా కలుపుకొని)

ఎంతో సులభంగా సందర్భంలో నైనా తడబడకుండా, మంచి నీళ్ళు తాగుతున్నట్లుగా మంచి ఇంగ్లీష్ నేర్పబడుతుంది.

ఇంగ్లీష్ రాయుటకు కావలసిన ఆంగ్ల వ్యాకరణం పరిపూర్ణంగా సూత్రాలతో చాలా ఈజీ గా నేర్పబడుతుంది.


***********పూర్తి డబ్బు వాపస్***********

మీ డబ్బుకి 100 శాతం గ్యారంటీ. కోర్స్ మీకు పూర్తి సంత్రుప్తిని ఇస్తుంది. మనస్పూర్తిగా మీకు కోర్స్ నచ్చలేదనిపిస్తే... కోర్స్ పుస్తకాలని బరబరా చింపివేసి, ముక్కల్ని పదిహేను రోజుల్లోపల మాకు పంపించండి. మీ పూర్తి డబ్బు తిరిగి పంపుతాము.(పోస్టల్ చార్జెస్ మినహాయించుకొని).

మీరీ కోర్స్ లో చేరినందువల్ల లాభమే తప్ప ఎటువంటి నష్టము లేదు.

ఇంకా ఎన్నో ఇతర కోర్స్ లు కలవు.

త్వరపడండి...మంచితరుణం, మించిన దొరకదు...

*******************************************


ఒక వార్తా పత్రికలో ఇది చదివి సంబర పడిపోయాను. ఆహా! రకరకాలుగా ఇంగ్లీష్ లో ఉత్తరాలు రాయటం నేర్చుకోవచ్చు కదా అని ఆనందమేసింది. రెండువందల రూపాయలలో ఎన్నో ఇతర ఇంగ్లీష్ కోర్స్ లు కూడా నేర్పిస్తారట. మనకు నచ్చక పోతే డబ్బులు కూడా వాపస్ చేసేస్తారు.

వెంటనే కూపన్ నింపేసి, మని ఆర్డర్ కూడా చేసేసాను. తిరుగు టపాలో ఇన్స్టిట్యూషన్ నుంచి నాకు ఎన్నో కోర్స్ పుస్తకాలు ఒచ్చేసాయి. అవన్ని కష్టపడి నేర్చుకొని నా ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పెంచుకున్నాను.

చక్కగా, కొత్తరకంగా ఎన్నో అప్లికేషన్లు రాయటం నేర్చుకున్నాను.

కావాలంటే మీకూ నేర్పిస్తాను...

నాకు ఫీజ్ ఒద్దులెండి !!!

నేను నేర్చుకున్న కొన్ని ఇంగ్లీష్ అప్లికేషన్స్, లీవ్ లెటర్స్ చూసి మీరు కూడా తప్పకుండా అభివృద్ధి చేసుకొండి...

మచ్చుకి కొన్ని:


ఇది ఒక అభ్యర్ద్ధి అప్లికేషన్:

"This has reference to your advertisement calling for a 'Typist' & 'Acountant' -Male or Female' ...As I am both for the past several years and I can handle both, I am applying for the post."


ఇది ఒక ఉద్యోగి లీవ్ లెటర్:

"Since I have to go to my village to sell my land along with my wife. Please sanction one week leave".


ఇంకొక ఉద్యోగి అప్లికేషన్:

"Since I have to go to cremation ground and I may not return, please grant half day leave".

ఒక విద్యార్ధి లీవ్ లెటర్:

"As I am studying in this college, I am suffering from head-ache. I request you to leave me today".


ఇంకో ఉద్యోగి లీవ్ లెటర్:

"As my mother-in-law has expired and I am responsible for it, please grant me 10 days leave".


చూసారా! నేను ఎంతో ఆత్మ విశ్వాసం తోటి పోస్టల్ కోచింగ్ లో పరిపూర్ణత సంపాదించానో!

బాగుంది కదు నా 'లెటర్ రైటింగ్ ప్రాక్టీస్'.

********************************************************************

21 కామెంట్‌లు:

Srini చెప్పారు...

LOL

sreenika చెప్పారు...

అయితే ముందు ముందు
మీతో ఎంగిలీషు లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. గంపలకొద్దీ ఎంగిలీషుని అంత చీపుగా అమ్మేసేవారెవరో శెలవిస్తే మా విధ్యార్ధులని జాగ్రత్త పడమంటాను.
చాలా బాగుంది మీ పోస్ట్.

SRRao చెప్పారు...

జయ గారూ !
అణువణువునా హాస్యం తొణీకిసలాడుతోంది కదండీ ! చక్కటి హాస్యం ఆరోగ్యానికి మంచిది. ఇలాంటి చిక్కటి హాస్యం ఆ ' రోగా నికి ' మంచిది.

తృష్ణ చెప్పారు...

నాకు ఈ "ఇంగ్లీషు లీవ్ లెటర్స్ మైల్" ఫ్రెండ్స్ పంపించారోచ్...ఇంకా మిగిలినవి కూడా రాయాల్సింది...సూపర్...ప్ట్ట చెక్కలౌతుంది చదువుతూంటే...నేను మావారికి చదివి వినిపించి ఆ రోజు పడీ పడీ నవ్వాను..

జయ చెప్పారు...

ఇలా మీరు కూడా చాలా నేర్చేసుకోవచ్చండి శ్రీనివాస్ గారు.

మా పిల్లల్ని అడిగినా కూడా ఇలాంటి ఇంగిలీసు మీకు చాలానే నేర్పిస్తారండి శ్రీనిక గారు. అస్సలు భయపడొద్దు.

జయ చెప్పారు...

రావ్ గారు ఇది నిజమైన ప్రకటనే నండి బాబు! బాగా ఎంజాయ్ చేయండి.


తృష్ణ గారు, ఇట్లాంటి లెటర్స్ కేమండి. ఎవరైనా, ఎన్నైనా రాసేయొచ్చు. ఎంజాయ్ చేసేయండి. మీరునేర్చుకోరా మరి.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

>>>As I am both for the past several years...
>>studying in this college, I am suffering from head-ache
>>>"As my mother-in-law has expired and I am responsible for it
>>I have to go to my village to sell my land along with my wife

ఆహో..ఒహో...ఒక్కక్కటి అద్బుతమైన వర్ణన...
మనలో మన మాటండీ...అసలు మనం తెల్లదొరలముందు ఇలాంటి ఇంగ్లీష్ మాట్లాడుంటే కొంచెం ముందుగానే ఫ్రీడం వచ్చుండేదేమో!!
ఫాకల్టీ రూంలో ఇంతకంటే ఘోరమైన ఇంగ్లీష్ మీరు వినే ఉండాలే!!! ఓసారి మా ఎలక్ట్రికల్ లేబ్ లో మా సారు నన్ను ఏదో సరిగ్గ చెయ్యలేదని 'Cant u electrical student? ' అని అన్నాడు..

భావన చెప్పారు...

Few more to add:

it was very hot in the afternoon when the teacher entered.. She tried to
switch the fan on, but there was some problem. and then she said

" why is fan not oning" (ing form of on)


teacher in a furious mood...

write down ur name and father of ur name!!



"shhh... quiet... the principal is revolving around college"

Tomorrow call ur parents especially mother and father



"why are you looking at the monkeys outside when i am in the class?!"


Seeing the principal passing by, the teacher told the noisy class..

"Keep quiet, the principal has passed away"

మురళి చెప్పారు...

జోకులు బాగున్నాయి జయగారూ.. నిజంగానే స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళ పుస్తకాల్లోవేనా??

జయ చెప్పారు...

శేఖర్ గారు, మీ మీద జోక్ కూడా చాలా బాగుంది. ఇలా హాయిగా ఎన్ని జోకులయినా ఎంజాయ్ చేసుకోవచ్చు కదూ! ఇలా మనచుట్టూనే ఎన్ని జోక్ లో. హాయిగా నవ్వుకుంటే పోలా! మీ సలహా ఆ రోజుల్లొ ఇవ్వకపోయారా, తొందరగా ఫ్రీడం వొచ్చేది.

జయ చెప్పారు...

భావన గారు, బ్రమ్హాండమైన ఇంగ్లీష్ రాసారండి.

మేము ఎప్పుడూ సర్దార్జీ జోకులు చెప్పుకుంటూ ఉంటాము. బాగుంటాయి కదూ. మేము కూడా ఎప్పుడు "principal has just passed away" joke చెప్పుకుంటూఉంటాము.

జయ చెప్పారు...

అయ్యో! మురళిగారు, మిమ్మల్ని చూస్తుంటే, చిన్నప్పుడు అమ్మతో గోదారికెళ్ళిన బుజ్జి మురళి గుర్తుకొస్తున్నాడు. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఎంతమాత్రం కాదు. ఎక్కడో పేపర్ లో, మూల ఒక చిన్న ప్రకటన చూసి, ఆ ప్రకటన ఇచ్చిన పద్ధతికి ఇలా రాద్దామనిపించింది. ఇంక జోకులంటార, చూశారా! భావనగారు ఎన్ని జోకులు చెప్పేశారో! అలాగే నేను కూడా కొన్ని జంతర్ మంతర్ లు చేసేసాను. అంతే...

కొత్త పాళీ చెప్పారు...

"దంచెద వూక యింగ్లీషున

జయ చెప్పారు...

కొత్తపాళీ గారు, ఏం రాశారండి. థాంక్స్.

శిశిర చెప్పారు...

:) ఇంత అందమైన ఇంగ్లీషు మీరు సహృదయంతో ఊరకే నేర్పించినా నేర్చుకోవడం కష్టమేమోనండి. ప్రస్తుతానికి ధ్యైర్యం చేయలేకపోతున్నాను.

జయ చెప్పారు...

శిశిర గారు, కొంచెం గుండె చిక్కబట్టుకొని, ధైర్యంతో ముందుకడుగేయండి. పంతులమ్మ భయపడితే ఎలా!

శిశిర చెప్పారు...

:) సరేనండి. ఏ విషయంలోనైనా నాకు మీ ప్రోత్సాహం వుంటుందని నిరూపించారు.

పరిమళం చెప్పారు...

హమ్మా ..జయగారు , ఎంతాశపెట్టారు ...ఏదో ఫ్రీగా నాలుగు ఇంగిలీసు ముక్కలు నేర్చేసుకుందామని అనుకుంటూ ఉండగా ఇలా నిరుత్సాహ పరుస్తారా ? నేనింకా పెద్ద పెద్ద పుస్తకాల్లోవన్నీ అవపోసన పట్టేద్దామనుకున్నానండీ ..:).

జయ చెప్పారు...

అబ్బా! ఎంతాశో, 200 రూపాయలకే అంతా నేర్చేసుకుందామనే! అయినా, పనికిరాని ఈ ఇంగిలీసు మీ విజ్ఞానం ముందు ఎంతండీ.

మా ఊరు చెప్పారు...

i have two daughters.both are girls

rain is raining outside.dont understand the tree

hahahahhaah
super

జయ చెప్పారు...

మా ఊరు గారు థాంక్యూ. మొత్తానికి మీ దగ్గిర చాలానే ఇంగిలీసు నేర్చుకోవాలి.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner