2, నవంబర్ 2009, సోమవారం

వనభోజనాలు





























"గోలా భాత్"

కార్తీక మాసం హరి, హరులకు ఎంతప్రీతో, మనకూ అంతే ప్రీతి. పూజలు, నోములకే కాదు, వనభోజనాలు కు కూడా ఇప్పుడే సరయిన సమయం. పౌర్ణమి వెన్నలలో చేసే భోజనాలు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. అందులో ఇంక రకరకాల వొంటలతోటి విందుభోజనం ఇంకా పసందుగా ఉంటుంది.

మరి వనభోజనాలలో నేను కూడా ఒక ఒంట చేయాలికదా. ఏం చేయాలబ్బా! ఇదే ఆలోచన. నేను రోజు సాయంత్రం వాకింగ్ కోసం పార్క్ కెల్తాను. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. నాకొక పంజాబి స్నేహితురాలు, గీతామెహ్రా ఉంది. తనతో మాట్లాడుతూ ఏదైనా కొత్తరకం వొంటకం చెప్పమన్నాను.మంచి మరాఠీ ఒంటకం చెప్తానని "గోలా భాత్" గురించి చెప్పింది. చివరికి నేను అదే చేద్దామని డిసైడ్ అయిపోయాను.

సో, పంజాబి ఫ్రెండ్ చెప్పిన మరాఠీ స్పెషల్ మన తెలుగు వనభోజనం లో మీ కందిస్తున్నాను. ఎంతైనా మనది "భినత్వంలో ఏకత్వం" కద.

గోలా భాత్ చేయు విధానబెట్టిదనిన: ఇది మనం చాలా సులభంగా చేసేసుకోవచ్చు. రైస్ కుక్కర్ లో కూడా వొండచ్చు. దీన్ని కొన్ని దశలుగా చెయాలి.

మొదటి దశ: గోలా భాత్ బాసుమతి బియ్యం లేదంటే మామూలు బియ్యమైనా వాడొచ్చు. ముందు ఒక బాండీ లో కొంచెం నెయ్యి వేసి అందులో అల్లం, ఎల్లిపాయ పేస్ట్ కొంచెంగా వేసుకోవాలి. అందులోనే కొంచెంగా దాల్చిన చెక్క, షాజీర, ఇలాచీలు కొంచెం పొడిపొడిగా దంచుకొని వేసుకోవాలి. కొంచెం మిరియాలు, ఇంగువ కూడా వేసుకోవాలి. దీనిని కొంచెంగా వేడిచేసి అందులోనే మనకు కావలసినంతగా బియ్యం వేసుకోవాలి. అరకొరగా బియ్యాన్ని వేయించి తీసి రైస్ కుక్కర్లో వేయాలి. ఒకవేళ కిలో బియ్యమైనట్లైతే దానిలో మన అలవాటును బట్టి నీరు పోసుకోవాలి. ఇష్టపడేవారు, వెజిటబల్ రైస్ లాగా కొన్ని కారట్, బీన్స్ ముక్కలు, బఠాణీలు కూడా వేసుకోవచ్చు. ఉడుకుతూ ఉండగా, గిన్నె అంచుల నుంచి కొంచెం నూనె వేయాలి. మధ్య భాగంలో రెండు లేదా మూడు చెంచాల నెయ్యి పోయాలి.

ఇందులోనే ఇంకొక భాగం కూడా ఉంది. ముఖ్యంగా దీనివల్లే దీనికి గోలా భాత్ అనే పేరొచ్చింది. కిలో బియ్యం గనక ఒండినట్లైతే అందులోకి అరకిలో శనగపిండి అవసరముంటుంది. శనగపిండిని ఒకగిన్నెలో వేసుకొని, అందులో కొంచెం ఉప్పూ, ఖారం, నూనె వేసి గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండితో గులాబ్ జాం లాగా కొన్ని చిన్న చిన్న గుండ్రని ముద్దలుగా చేసుకోవాలి. వీటినే మరాఠివాళ్ళు "గోలా" అని అంటారు. తర్వాత లడ్డూలను రైస్ కుక్కర్ లో ఉడుకుతున్న బియ్యంలో వేయాలి. భయపడఖర్లేదు. ఇవి బియ్యంలో కలసిపోవులెండి. చక్కగా విడి విడిగానే బియ్యంతో పాటే ఉడుకుతాయి. అదే సమయంలో భాత్ లో కొంచెం ఉప్పేసుకోవాలి.

సో, యువర్ "గోలా భాత్" ఈజ్ రేడీ...

ఇంక రెండవ దశ: ఇమిలీ చట్నీ

ఇది ఇంకా ఈజీ. ఆడుతూ పాడుతూ చేసేయొచ్చు. ఏంలేదండి. ఇప్పుడేం చేయాలంటే గోలాభాత్ తినేటప్పుడు చట్నీ కావాలికదా! అది తయారు చేయాలన్నమాట. ఒంట మొదలు పెట్టటానికి ముందుగానే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి.దాన్ని కొంచెం జారుగా చేసుకొని అందులోనుంచి చింతపండు మిగిలిన తుక్కు తీసేయాలి. అందులోనే చాలా కొంచెంగా శనగపిండి నీటిలో కలుపుకొని ఇందులో కలపాలి. చిటికెడు బెల్లం, కొంచెం ఉప్పూ కూడా ఇందులో వేయాలి. దీనిని స్టౌ మీద కాసేపు ఉడికించి దించేయాలి. ఇదే ఇమిలీ చట్నీ. దీనిని గోలా భాత్ తో నంచుకొని తినాలి. అప్పుడు స్వర్గానికి బెత్తడే దూరం, అంతే.

మూడవ దశ: ఇక్కడ నూనెలో పోపు చేసుకోవాలి అంతే. నూనె వేడిచేసి అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి పోపు చేసుకోవాలి. కావాలనుకుంటే, తినే అలవాటు ఉన్నవాళ్ళు ఇందులో మూడు, నాలుగు ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవచ్చు. నూనె గోలాభాత్ తినేటప్పుడు కొంచెంగా పైన వేసుకోవాలి. ఇందులోని మిరపకాయాలు కొంచెంగా కొరుక్కుంటూ భాత్ తినొచ్చు. గోలా భాత్ తినేటప్పుడు ఒకపక్క ఇమిలీ చట్నీ, ఇంకో పక్క పోపు వేసిన నూనె ఉంచుకొని తినాలి. కావాలనుకుంటే మధ్యమధ్యలో సలాడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు.

ఇదండీ గోలాభాత్... బాగుందికదూ!

ఏవిటో, ఎంత ఫ్రెండైతే మాత్రం పుంజాబీ ఆంటీ చెప్పిన మరాఠీ వంటకం మన ఆంధ్రా వనభోజనాలలొ చేస్తుందా! ఎంత ధైర్యం అని నన్ను గిరగిరా తిప్పి అవతల విసిరేస్తారో ఏమొ....


*********************************************************************************************************************

30 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

హమ్మో! ఇంకో వంటకమా! నా వల్ల కాదు బాబోయ్! సరే మిమ్మల్నెందుకు కాదనాలి కాస్సేపాగి తింటాలెండి.

సిరిసిరిమువ్వ చెప్పారు...

ఈ గోలాల గోల ఎప్పుడూ వినలేదండి, వెరయిటీగా బాగుంది, మీరు చెప్పిన విధానం ఇంకా బాగుంది. ఇలా వెరయిటీలు ఉంటేనే వనభోజనానికి మంచి కలర్ వచ్చేది!

నేస్తం చెప్పారు...

వెరైటిగా ఉంది ఒకసారి చేయాలి

సుభద్ర చెప్పారు...

జయగారు,
బొమ్మ మాత్ర౦ కేవ్వు కేక..మీ భినత్వ౦ లో ఏకత్వ౦ కూడా సుపర్...నేను ఆరోగ్యరిత్య రోజు అన్న౦ తిన్నను..ఏదైనా ప౦డగో పబ్బ మమో..మా ఇ౦టికి ఎవరైనా వస్తేనో లేక మేము ఎక్కడికైనా వెళ్ళితే నో తప్ప..అరే నాకోస౦ రైస్ ఐటమ్ ఎవరు వ౦డలేదే అని అనుకు౦టున్నా సరిగ్గా మీరు నాకోస౦ "గోలాభాత్"వ౦డారు.
నేను సాయ౦త్రమే ట్రయి చేస్తాను.

సుభద్ర చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
anagha చెప్పారు...

కార్తిక సోమవారం,పౌర్ణమి ,అందరు ఉపవాసముంటారు .ఈ రోజు వంటకాల గురించి ,పైగా ఫొటోస్ .....పరిక్షన్నమాట!

భావన చెప్పారు...

ఇదేమి వంటకమమ్మోయ్ బలే వుంది ఫొటో మాత్రం సూపర్, నిజం చెప్పండి జయ మీరు తిన్నాకే మాకు పెడుతున్నారు కదు పూర్తి గా ఎక్స్పెరిమెంట్ కాదు కదు, ఏయ్.. నవ్వుతున్నారు అమ్మాయ్ సుభద్ర, నేస్తం జయ నవ్వుతున్నారు జాగ్రత్త ముందు ఒక స్పూన్ తిని ఆనక ప్లేట్ ఫుల్ల్ వేయించుకుందాము.. ఎంచక్క గా బిళ్ళల పులుసు తేకూడదూ..

జయ చెప్పారు...

విజయ్ మోహన్ గారు, మీరు ఇంకా నా వంటకం తిన్నట్లు లేదు. బ్లాగ్లోకంలో మీరు ఇవాళ ఎంత తిన్నా తరగని వంటకాలే...వంటకాలు. ఇవాళ కాస్త ఎక్కువైనా ఫరువాలేదు. లాగించేయండి. లోకానికి అన్నదాతలు మీరు. మీకు ఎంతో శక్తి కావాలి కదా.

జయ చెప్పారు...

సిరిసిరిమువ్వ గారు, మనం ఈ గోలాల గోల కనీసం ఇప్పుడన్నా వినాలికదా! ఇంతకు మించిన తరుణం ఇంకెప్పుడండీ? వెరయిటీలు ఉంటేనే కదా...వనభోజనం. అన్నీ నంచుకుంటూ తినేయండి మరీ...

జయ చెప్పారు...

నేస్తం గారు, చేయండి...చేయండి.. ఒకసారేంటి...ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. వెరయిటీకి వెరయిటీ రుచికి రుచి. బాగుంటుంది. అనుమానం వొద్దు. నేనూ తిన్నాను కదా...

జయ చెప్పారు...

సుభద్ర గారు ఇవాళ రైస్ అయిటం తినేయాల్సిందే! నేను చేసాను కదా మీకోసం. అందులోను గోలా భాత్. ఫొటో బాగుందా...థాంక్యూ.

మాలా కుమార్ చెప్పారు...

వెరైటీగా గొలాభాత్ బాగుంది . ఫొటో బాగుంది .

జయ చెప్పారు...

అనఘ గారు. ఏదో లెండి...ఈ పౌర్ణమి కి ఒదిలేసేయండి. సుష్టుగా భోంచేసేయండి. ఇన్ని రుచులు మళ్ళీ మీకెప్పుడు దొరకాలి.


భావన గారు, అస్సలు భయమొద్దు. ధైర్యే సాహసే లక్ష్మి అనుకోని తినేయడమే...నేను కూడా తిన్నానులెండి. బిళ్ళల పులుసు దీనికి సూట్ అవదే మరి!

జయ చెప్పారు...

అక్కా, గోలా భాత్ బాగుందా.. ఫొటో కూడా బాగుందా.. మరి తినేసెయ్...ఎందుకాలస్యం.

జ్యోతి చెప్పారు...

బావుంది కొత్త వెరయిటీ. నూనె వేసుకుని తినడం కూడా. ట్రై చేయాల్సిందే. ఈ గోలాలను (కోఫ్తా) ఆవిరి మీద ఉడికించి, వేయించి కలిపితే ఇంకా బావుంటుందేమో..

sunita చెప్పారు...

ఇప్పటివరకూ వచ్చిన వంటకాల్లో నాకు బొత్తిగా పరిచయం లేని వంటకం.ఫోటో మాత్రం బ్రమ్హాండం.

Hima bindu చెప్పారు...

మీ గోలబాత్ సూపర్ ,ఇంతకి తిన్నారా ?అమ్మో అన్ని స్టేప్సా!

జయ చెప్పారు...

జ్యోతి గారు, ఇది మరాఠి అయిటం కదా అలానే ఉంటుంది. నూనెలో వేయించటం గట్రా ఏమి చేయొద్దు. బాల్స్ గుండ్రంగ గట్టిగా చెసుకోని రైస్ లో వేయటమే. నూనె నంచుకునే పద్దతి తెలంగాణాలో కూడా ఉంది. అయినా, ఇవాళ రైస్ అయిటంస్ ఏమీ లేవు కదా! కాబట్టి ఇది అందరూ ఎంజాయ్ చేసేయొచ్చు.

జయ చెప్పారు...

సునిత గారు, పరిచయం లేనివాటినే కదండీ తెలుసుకోవాల్సింది. ఫొటో నే కాదు వంట కూడా బ్రమ్హాండమే...తిని చూడండి. వనభోజనాలు పాట నచ్చిందా?

జయ చెప్పారు...

చిన్ని గారు గోలాభాత్ బాగుంటుంది. పేరుకి స్టెప్సే కాని నిమిషాల మీద పని. అంత గోలబాత్ ఏమి కాదు. ఈ వనభోజనాల పాట వినుకుంటూ చేసేయండి. మజా వొస్తుంది.

తృష్ణ చెప్పారు...

నన్ను రైస్ ఐటెమ్ అడిగి అడిగి విసుగొచ్చి ఇలా మీరే ఎడమ్ చే్త్తో చేసి అవతల పడేసారా? (నాకు గుర్తుంది..కానీ చేతికి పరికరమ్ ఈ మధ్యనె దొరికింది..ఇహ పయొగాలే ప్రయోగాలు..)
photo బాగుంది..మరి రుచి కూడా అలానే ఉంటుందాండీ...

జయ చెప్పారు...

మరేం చేయను తృష్ణా! ఎంతకాలం ఎదురు చూడాలి. రుచి కూడా ఫొటో లాగానే ఉంటుంది. ఎడమ చేత్తో కాదులే కుడి చేత్తోనే చేసాను. ఇంతకీ వనభోజనాలు పాట నచ్చిందా లేదా?

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

గోలా భాత్ బాగుంది. ఛాన్ ఛాన్.

జయ చెప్పారు...

సూర్యలక్ష్మి గారు, అంత బాగుందా! అయితే వెంటనే తినేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

sreenika చెప్పారు...

ఖచ్చితంగా ఇది మామీద ప్రయోగమే...
టపాలో మీరెక్కడా తిన్నట్లు లేదు.
అయినా మీరు మంచివార్లెండి.నమ్ముతాను. ఒకసారి చేసి చూస్తాను.

జయ చెప్పారు...

భయం వొద్దులెండి శ్రీనిక గారు. మరాఠి వాళ్ళు రోజు తింటూనే ఉన్నారు. నేను కూడా తిన్నాను. అన్నీ కూరలే కదా, ఈ రైస్ అయిటం తిని చూడండి. బాగుంటుంది.

శ్రీలలిత చెప్పారు...

జయగారూ, ఇప్పుడే చూసాను మీ గోలాబాత్. పేరు చూసి గోల గోలగా ఉంటుందనుకున్నాను కాని చేసి చూస్తే బాగుండేటట్టే ఉంది. పాట కూడా సరైనదే పెట్టారు. కంగ్రాట్స్..

జయ చెప్పారు...

శ్రీలలిత గారు, నా గోల గోల బాత్ నచ్చినందుకు చాలా థాంక్స్. హమ్మయ్య.. నా వన భోజనం పాట మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఫోటో మాత్రం చాలా బాగుందండీ...

జయ చెప్పారు...

వేణు శ్రీకాంత్ గారు, ఫొటో మాత్రమేనా...ఏం తినటానికి బాగా లేదా! కొంచెం తినండి ప్లీజ్...

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner